‘వీరయ్య’ నుంచి ‘భోళా శంకర్’‌గా ప్రమోట్ అయిన మెగాస్టార్.!

- January 18, 2023 , by Maagulf
‘వీరయ్య’ నుంచి ‘భోళా శంకర్’‌గా ప్రమోట్ అయిన మెగాస్టార్.!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్గ్‌గా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వీరయ్య’గా మళ్లీ ట్రెండ్ సృష్టించారు మెగాస్టార్.

ఈ ట్రెండ్‌ని అలా కంటిన్యూ చేసేలా ఆ మేనియా ఇంకా ముగియకుండానే తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ ‘వేదాళం’ కి రీమేక్‌గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఆల్రెడీ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది.

శరవేగంగా సినిమాని పూర్తి చేసి, సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిరంజీవి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com