రష్మికకు ‘మిషన్ మజ్ను’ మరో ‘సీతారామం’ అవుతుందా.?
- January 18, 2023
ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ విశేషంగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధం కలిపిన ప్రేమ అనే ట్యాగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు రష్మిక మండన్నా హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ ఈ నెల 20న రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఆర్మీ అండ్ లవ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందిందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. దాంతో, ఈ సినిమా మరో ‘సీతారామం’ అవుతుందని అనుకుంటున్నారట.
ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. రష్మిక, సిద్దార్ధ్ జంట చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. అన్నట్లు రష్మిక సైన్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదేనట.
రిలీజ్ లేట్ అయిన కారణంగా అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘గుడ్ బై’ చిత్రం ముందుగా రిలీజైపోయింది. ఓటీటీలో రిలీజవుతుండడం వల్ల ఎక్కువ రీచ్ వుంటుంది. అది రష్మికకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







