షార్జాలో 24-కిమీ సైకిల్ ట్రాక్ ప్రారంభం
- January 19, 2023
షార్జా: షార్జాలో 24 కిలోమీటర్ల మేర నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ఆఫీస్ డైరెక్టర్ షేక్ సౌద్ బిన్ సుల్తాన్ బిన్ మహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అల్ బటాయే ఈ ప్రత్యేక సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ ట్రాక్ ను నిర్మించారు. షార్జా సెంట్రల్ రీజియన్‌లో 24 కిలోమీటర్ల ట్రాక్ ను మొత్తం 5 మీటర్ల వెడల్పుతో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని షేక్ సుల్తాన్ ఆదేశించారు. ట్రాక్‌లో కార్ పార్కింగ్లు, ప్రార్థన గదులు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ సర్వే, షార్జా ఎమిరేట్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పర్యవేక్షణలో ఈ ట్రాక్ రూపకల్పన, నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ట్రాక్ ప్రారంభం, చివరిలో 4 రెస్ట్‌రూమ్‌లను నిర్మించారు.సైకిల్ అద్దె-నిర్వహణ కేంద్రం, రెస్టారెంట్లు వంటివి త్వరలోనే ట్రాక్‌లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!







