నాలుగు ప్రదేశాలలో 17 రోజులపాటు మస్కట్ నైట్స్ ఫెస్టివల్
- January 19, 2023
మస్కట్: నాలుగు ప్రదేశాలలో 17 రోజులపాటు మస్కట్ నైట్స్ ఫెస్టివల్ అలరించనున్నది. అల్ ఖురమ్ నేచురల్ పార్క్, నసీమ్ పార్క్, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) - నాలుగు ప్రదేశాలలో 17-రోజులపాటు మస్కట్ నైట్స్ ఈవెంట్ సందడి చేయనున్నది. మస్కట్ గవర్నర్ సయ్యద్ సౌద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ ఆధ్వర్యంలో అల్ ఖురమ్ నేచురల్ పార్క్‌లోని సరస్సు వేదికగా నేడు మస్కట్ నైట్స్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. మస్కట్ మునిసిపాలిటీ చివరిగా 2019లో మస్కట్ నైట్స్ ఈవెంట్ ను నిర్వహించింది. కుటుంబాలు, పిల్లలు, యువతను దృష్టిలో పెట్టుకొని అనేక వినోదభరితమైన ఈవెంట్లను షెడ్యూల్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ చైర్మన్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్ హమీది తెలిపారు. మస్కట్ నైట్స్ 2023 లక్ష్యం కేవలం వినోదానికే పరిమితం కాదని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు స్థానిక పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. మస్కట్ నైట్స్ మొదటిసారిగా వినియోగంలోకి తెచ్చిన యాప్ ద్వారా వివిధ వేదికల వద్ద జరిగే ఈవెంట్ల గురించి తెలుసుకోవచ్చని, ఆన్లైన్లో టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని అల్ హమీది తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







