ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం..

- January 19, 2023 , by Maagulf
ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం..

న్యూ ఢిల్లీ: భారత 76వ రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ సిద్ధమవుతుంది.రిపబ్లిక్‌ డే వేడుకలను అట్టహాసంగా నిర్వించేందుకు ఇప్పటి నుండే సైనికులు రిహార్సల్స్‌ మొదలు పెట్టారు.ఢిల్లీలో కొరికే చలిని సైతం లెక్కచేయకుండా సైనికులు చేస్తున్న రిహార్సల్స్ ఔరా అనిపిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 2023లో అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.ఈ వేడుకలను చాలా ప్రత్యేకంగా జరుపుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో చాలా ప్రత్యేకతలుండనున్నాయి.ప్రతీ ఏడాదిలాగే మువ్వెన్నల రెపరెపలు.. వాయుసేన విన్యాసాలు.. శకటాల ప్రదర్శనలు, దేశ విదేశీ ప్రముఖ్యులు మాత్రమే కాకుండా మరికొంత ప్రత్యేకంగా నిలువనుంది. రొటీన్‌కు భిన్నంగా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఏడాది స్వతంత్ర భారత అమృతోత్సవాలు చాలా ప్రత్యేకంగా నిలువనున్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్ 2023 స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో రిక్షా పుల్లర్ల మొదలు కూరగాయల విక్రేతలు వీవీఐపీలుగా మారనున్నారు. అంతేకాదు వీరు అదరికంటే ముందు వరుసలో ఆసీనులు కానున్నారు. వీరిని ప్రత్యేక అధికారిక ఆహ్వానితులు పరిగణించనున్నారు. తద్వారా నిజంగా రిపబ్లిక్ భారత స్ఫూర్తిని సూచిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు,శ్రమజీవి (సెంట్రల్ విస్టా నిర్మాణానికి సహకరించిన కార్మికులు), వారి కుటుంబాలు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, రిక్షా పుల్లర్లు, చిన్న కిరాణా వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు వంటి ఇతర సంఘం సభ్యులు ప్రధాన వేదిక ముందు కూర్చుంటారు.

అంటే, గణతంత్ర దినోత్సవ వేడుకలు జనభాగధారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో ఈ వేడుకలు జరుగనున్నాయి.సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, మిల్క్ బూత్ కార్మికులు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్లు పాల్గొంటుండటం విశేషం. ప్రజెంటేషన్ సమయంలో అధికారులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

కవాతు సమయంలో ఈ సంవత్సరం వేడుకల థీమ్ అన్ని R-డే కార్యక్రమాలలో సామాన్య ప్రజల భాగస్వామ్యం చేయడే లక్ష్యంగా తీసుకుంది మోదీ ప్రభుత్వం. ఇదిలావుంటే, ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023 ప్రత్యక్ష ప్రసారం కర్తవ్య పథ్ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ప్రధాని .. అమర్ జవాన్ జ్యోతిని సందర్శించారు.తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం తర్వాత జరుగుతున్న మొదటి  రిపబ్లిక్-డే ఈవెంట్ ఇదే కావడం విశేషం.ఇందులో అదనంగా, ఈజిప్టు నుంచి 120 మంది సభ్యుల కవాతు బృందం కూడా ఇందులో పాల్గొంటుంది. తొలిసారిగా ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఆహ్వానాలను ఆన్‌లైన్లో పంపనున్నట్లు అధికారులు తెలిపారు.గత సంవత్సరం రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన తర్వాత సెరిమోన్గియల్ బౌలేవార్డ్ లో నిర్వహించబడుతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఇవే.రాజ్‌పథ్ అని పిలువబడే వేదికకు కర్తవ్య మార్గంగా పేరు మార్చబడిన తర్వాత ఇది మొదటి రిపబ్లిక్ డే పరేడ్.ఈ పరేడ్‌లో 32,000 సీట్లను 45,000 సీట్లను పెంచారు. బీటింగ్ రిట్రీట్ ఈవెంట్ కోసం మొత్తం సీట్లలో 10% ప్రజలకు ఆన్‌లైన్ విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com