గూగుల్‌లో 12,000 మంది ఉద్యోగుల తొలగింపు..
- January 20, 2023
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో గూగుల్ కూడా చేరింది. గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది.
కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. గూగుల్ షేర్లు మార్కెట్లో దూసుకుపోతున్నప్పటికీ, కంపెనీ ఉద్యోగాల్ని తొలగించాలనుకోవడం గమనార్హం. గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థల ద్వారా ఆల్ఫాబెట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ సంస్థకు మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుంచి పోటీ ఎదురవుతోంది. ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల సంస్థపై రివ్యూ జరిపారు. సంస్థ ఉత్పత్తులు, సిబ్బంది, ప్రాధాన్యతలు, ఉద్యోగాలు వంటి అంశాలపై సమీక్ష జరిపి ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ నిర్ణయం అమలవుతుంది.
సంస్థ బాగానే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పూర్తి బాధ్యత తనదే అని సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు చెప్పారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెంటనే అమలుకానుంది. అమెరికాలో ఎక్కువగా ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉంది. అయితే, అనేక దేశాల్లో ఉన్న స్థానిక చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆలస్యం కావొచ్చు. ఉద్యోగాలు కోల్పోయే వారికి ఇప్పటికే మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చింది సంస్థ.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు