యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి Dhs100,000 జరిమానా, ఏడాది జైలు

- January 22, 2023 , by Maagulf
యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి Dhs100,000 జరిమానా, ఏడాది జైలు

యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగల విధులకు ఆటంకం కలిగించినా.. దాడులకు పాల్పడిన వారికి Dhs100,000 వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP)తన సోషల్ మీడియా ఖాతాలలో పబ్లిక్ ఉద్యోగులపై దాడికి సంబంధించిన జరిమానా, జైలుశిక్ష గురించి తెలిపే పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. నేరాలు, జరిమానాలపై ఫెడరల్ డిక్రీ-లా నెం.31 2021లోని ఆర్టికల్ 297 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా, హింసాత్మకంగా లేదా బెదిరింపులకు ఎవరైనా దిగితే.. ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలుశిక్ష, Dhs100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ కమ్యూనిటీ సభ్యులలో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టం గురించి అవగాహనను పెంచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ పోస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com