గృహ సహాయం విలువను పెంచిన ఒమన్

- January 23, 2023 , by Maagulf
గృహ సహాయం విలువను పెంచిన ఒమన్

మస్కట్: నిరుపేద కుటుంబాలకు వారి ఇళ్లను నిర్మించడానికి లేదా పునర్నిర్మించడానికి ఆర్థిక సహాయాన్ని పెంచుతూ హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సైద్ అల్ షుయిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన పౌరులకు అందించే గృహ సహాయం విలువపై మునుపటి మంత్రివర్గ నిర్ణయం నెం. 6/2011లోని ఆర్టికల్ (18)ని సవరిస్తూ కొత్తగా 9/2023 ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, సామాజిక భద్రతా కుటుంబాల కుటుంబాలకు సేవలందిస్తున్న సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ లబ్ధిదారులకు లబ్ది చేకూరనుంది.  కొత్త సవరణల ప్రకారం.. ఇద్దరు నుండి ముగ్గురు సభ్యులతో కూడిన అర్హతగల కుటుంబాలు నివాసాన్ని నిర్మించడానికి లేదా పునర్నిర్మించడానికి OMR25,000 గృహ సహాయానికి అర్హులు. ఇది నిర్మిత ప్రాంతం 140 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. లబ్ధిదారుడు విలువకు సహకారం అందించినట్లయితే, విస్తీర్ణం 250 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన అర్హతగల కుటుంబాలకు OMR30,000 గృహ సహాయానికి అందుతుంది. నిర్మిత నివాస ప్రాంతం (నిర్మించబడిన లేదా పునర్నిర్మించబడే) విస్తీర్ణం 190 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. లబ్ధిదారులు విలువకు సహకరించే సందర్భంలో, ప్రాంతం 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు.  ఇంతకుముందు ఆర్టికల్ (18) గృహ సహాయం  విలువను గరిష్టంగా OMR20,000గా నిర్ణయించారు. 2019లో హౌసింగ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద 1,000 కంటే ఎక్కువ కుటుంబాలకు OMR41 మిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేశారు. 2020లో 600 కుటుంబాలకు OMR15 మిలియన్ల కంటే ఎక్కువ సాయం అందించారు. 2021లో లబ్ధిదారుల సంఖ్య 1,261 కుటుంబాలకు చేరగా.. OMR30 మిలియన్ల సాయం కింద అందించారు. 2022లో 1,478 కుటుంబాలకు OMR35 మిలియన్ల ఇన్‌పుట్‌ సాయాన్ని అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com