త్వరలో మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాబోతున్నాయి
- January 23, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా..ఇక ఇప్పుడు మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పెంచడం, జలంధర్‌తో లూథియానా లేదా కోయంబత్తూర్ వంటి టైర్-టూ నగరాలను మధురైతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 8 కోచ్‌లతో మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలో వాటిని పట్టాలెక్కించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో దీని కోసం ఒక నమూనా తయారు చేస్తోంది. సీటింగ్ అమరికతో కూడిన మినీ-వందే భారత్ ఎక్స్‌ప్రెస్ డిజైన్ దాదాపుగా ఫైనల్ అయినందున అటువంటి ఎనిమిది కోచ్‌ల వందే భారత్ ఈ ఏడాది మార్చి-చివరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ప్రయాణికుల కోసం త్వరలో మరో మూడు వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏయే మార్గాల్లో అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారులు కూడా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో విడతలో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక, నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







