బుట్టబొమ్మ ‘క్రష్’ ఎవరితోనో తెలుసా.?
- January 24, 2023
బుట్టబొమ్మ అంటే పూజా హెగ్దే అనుకునేరు. కాదు కాదు, ఇప్పుడు బుట్టబొమ్మ అంటే అనిఖా సురేంద్రన్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘బుట్టబొమ్మ’. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది అనిఖా సురేంద్రన్.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన అనిఖా, హీరోయిన్‌గానూ రాణించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమాతో రాబోతోంది.
ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కావల్సి వుండగా, మరో వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యింది. ఫిబ్రవరి 4న ‘బుట్టబొమ్మ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తుండగా, శౌరి చంద్రశేఖర్ రమేష్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా అలరించబోతోందని అంటున్నారు. ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పింది అనిఖా సురేంద్రన్. దాంతో, రౌడీ ఫ్యాన్స్ నెట్టింట్లో అనిఖాని ఫాలో చేయడం స్టార్ట్ చేసేశారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









