శ్రీలీల విషయంలో రవితేజ జోస్యం ఫలిస్తుందా.?

- January 25, 2023 , by Maagulf
శ్రీలీల విషయంలో రవితేజ జోస్యం ఫలిస్తుందా.?

‘ధమాకా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ మీదున్న చలాకీ పిల్ల శ్రీ లీల. ‘ధమాకా’ హిట్‌తో శ్రీ లీల పేరు మీడియాలో మోత మోగిపోతోంది. 

అంతేకాదు, చేతి నిండా ప్రాజెక్టులతో శ్రీలీల డైరీ కళకళలాడిపోతోంది కూడా. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ఓ సినిమాలో నటిస్తోంది శ్రీలీల.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తోంది. అలాగే, యంగ్ హీరో రామ్ పోతినేనితో ఇంకో సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. 

దీంతో పాటూ, మెగా కాంపౌండ్ హీరోల దృష్టి కూడా శ్రీలీలపై పడినట్లు తాజా సమాచారం. ఒకవేళ అదే జరిగితే, శ్రీలీల టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

‘ధమాకా’ టైమ్‌లోనే శ్రీలీల భవిష్యత్తు చెప్పేశాడు మాస్ రాజా రవితేజ. తర్వాత ఇంకో సినిమాకి నాతో చేసేంత టైమ్ వుంటుందో లేదో శ్రీలీలకు.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉన్నాయి శ్రీలీలకు అన్నాడు మాస్ రాజా రవితేజ. ఏమో అది నిజమవుతుందేమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com