గోంగూర తింటే వేడి చేస్తుందా.?
- January 25, 2023
తెలుగు నాట గోంగూరకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఆకుకూరల్లో గోంగూరకు ప్రధమ స్థానం అనే చెప్పాలేమో. అయితే, గోంగూర విషయంలో చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూరలో విటమిన్లూ, ఐరన్ పుష్కలంగా వుంటుంది. గోంగూర తింటే ఎక్కువగా వేడి చేస్తుందన్న అనుమానం చాలా మందిలో వుంటుంది. కానీ, గోంగూరలోని ఐరన్ శరీర ఉష్ణోగ్రతని సమపాళ్లలో వుంచుతుంది.
బాలింతలకు గోంగూర అస్సలు పెట్టరు. కానీ, గోంగూర తినడం వల్ల బిడ్డకి సరిపడా పాలు పుష్కలంగా పడతాయని నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. రోగ నిరోధక శక్తిని అందించడంలో గోంగూర పాత్ర కీలకం. అలాగే గోంగూర తరచూ తినేవారిలో హెయిర్ ఫాల్ సమస్య కాస్త తక్కువగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయ్.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







