హీరో అడివి శేష్ ఇంట పెళ్లి సందడి
- January 25, 2023హిట్ 2 తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేషు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. శేషు సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ ఈవెంట్స్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ వేడుకల్లో సందడి చేశాడు. కాగా తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు అడివి శేష్ . ‘చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను ఆనందంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం’ అని ఒక పోస్టు షేర్ చేయగా.. ‘చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. కానీ పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది’ అని మరో పోస్టును పంచుకున్నాడు.
ఇక శేషు సినిమాల విషయానికి వస్తే..మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ వస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్2.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుననాడు. ఇటీవలే ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. మొదటి పార్ట్‌ను మించి మరింత ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఈ సినిమాను తెరెక్కించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు