హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం
- January 25, 2023
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గోవాకు ఆకాశ ఎయిర్ తొలి విమాన సర్వీసును ఈరోజు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. ప్రారంభ విమానం హైదరాబాద్ నుండి గోవాకు మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరింది. ఆకాశ హైదరాబాద్ నుండి బెంగళూరుకు రోజువారీ విమానాలను కూడా ప్రారంభించింది. GHIAL, ఆకాశ సీనియర్ అధికారులు మరియు ఇతర విమానాశ్రయ భాగస్వాములు విమానాశ్రయంలో ఈ రోజు ఆకాశ ఎయిర్‌లైన్ తొలి విమాన సర్వీసులో వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు పలికారు.
ప్రదీప్ పణికర్, CEO-GHIAL మాట్లాడుతూ, “హైదరబాద్ నుంచి వీలైనంత దేశీయ ఎయిర్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, మరిన్ని విమానయాన సంస్థలను జోడించడానికి మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో GHIAL నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు ప్రారంభించడంపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దశల వారీగా విస్తరణ, తద్వారా విమానాశ్రయ సామర్థ్యం పెరుగుదలతో, మరిన్ని గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు రావడం వల్ల మరింత ఎక్కువ మంది ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంది. భారతీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ఆకాశ ఎయిర్ సర్వీసుల ప్రారంభం ఈ దిశగా మరో ముందడుగు.’’ అన్నారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







