తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

- January 25, 2023 , by Maagulf
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 60 మంది ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేశారు.వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ ఎస్పీలు, సీపీలు బదిలీ అయ్యారు.మల్కాజ్ గిరి డీసీపీగా జానకి దరావత్, రామగుండం సీపీగా సుబ్బారాయుడు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్, ఉమెన్ సేఫ్టీ ఎస్పీగా పద్మజ, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.

రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.భారీగా అధికారులు ట్రాన్సఫర్ అయ్యారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చాక ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారు అనే దాని పై పూర్తిగా క్లారిటీ వస్తుంది. జనవరి 4న 29మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ నెలలోనే ఐపీఎస్ ల బదిలీలు జరగడం ఇది రెండోసారి. లాంగ్ స్టాండింగ్ పీరియడ్ లో ఉన్నవారిని బదిలీలు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి డీజీపీ అంజనీ కుమార్.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com