ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం

- January 25, 2023 , by Maagulf
ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం

హైదరాబాద్‌: భారత దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.248.6 కోట్ల అన్‌ ఆడిట్‌ రాబడిని నమోదు చేసినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. డిసెంబర్‌-22తో ముగిసిన ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఒలెక్ట్రా ఆదాయం రూ.766.0 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల కాలంలో నమోదైన ఆదాయం రూ. 317.3 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 141 శాతం పెరిగినట్లు వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 142 విద్యుత్‌ బస్సుల సరఫరా వల్ల మెరుగైన వృద్థిని సాధించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇంతక్రితం 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో 103 బస్సులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ రూ.18.2 కోట్ల నికర లాభాలు ఆర్జించగా.. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు త్రైమాసికాల్లో రూ.42.9 కోట్ల లాభాన్ని సాధించినట్లు తెలిపింది. క్రితం క్యూ3లో 136 శాతం వృద్థితో రూ.24.7 కోట్ల లాభాలను గడించినట్లు వెల్లడించింది. ''గత కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇవి మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఒలెక్ట్రా స్థిరమైన రాబడితో పాటు మార్జిన్‌ వద్ధి సాధించింది. బలమైన వ్యాపార పనితీరును ప్రదర్శించడం వల్లే ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరపతిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. మిగిలిన ఆర్డర్‌లను సకాలంలో సరఫరా చేయడంపైనే దష్టి పెట్టాలని భావిస్తున్నాము.'' అని ఒలెక్ట్రా సిఎండి కెవి ప్రదీప్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com