లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

- January 27, 2023 , by Maagulf
లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

కుప్పం: టీడీపీ పార్టీ నేత నారా లోకేష్‌ ‘యువగళం’ యాత్రలో అప శృతి చోటు చేసుకుంది. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న సోమసిల్లి పడిపోయాడు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించగా, తారకరత్న కూడా పాల్గొన్నారు.

లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సోమ్మసిల్లి పడిపోయాడు. ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com