రామ్ పోతినేని.! 100 మంది కాదు షేర్‌ఖాన్.. 300 మంది.!
- January 28, 2023
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్లాన్ మామూలుగా లేదండోయ్. ఎలాగైనా ఈ సారి గట్టి హిట్ కొట్టాలన్న కసితో వున్నాడీ యంగ్ హీరో. అందులో భాగంగానే మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేతులు కలిపాడు. ఇటీవలే ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్‌కి ఆశించిన సక్సెస్ అందలేదు.
దాంతో, మరింత కసి పెంచాడు. బోయపాటితో చేయబోయే సినిమా అలా ఇలా వుండదంట. మాస్ యాక్షన్‌కి పెట్టింది పేరైన బోయపాటి, రామ్‌తో చేయబోయే యాక్షన్ ప్యాన్ ఇండియా రేంజ్లో వుండబోతోంది. ‘మగధీర’లో 100 మందితో తీసిన ఫైట్ సంచలనం కాగా, ఇప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడే ఏకంగా 300 మందితో రామ్ పోతినేని మీద తెరకెక్కించబోతున్నాడట బోయపాటి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపొందబోతోంది ఈ సినిమా. రామ్ కెరీర్లో మరో ఇస్మార్ట్ శంకర్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







