తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం.! తీవ్రమైన గుండెపోటు.!
- January 28, 2023నందమూరి హీరో తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన గుండెలోని ఎడమవైపు కవాటం 90 శాతం బ్లాక్ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఎక్మోపై వుంచినట్లు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాద యాత్రలో తారక రత్న అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. స్పృహ కోల్పోయిన తారకరత్నను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 45 నిముషాల పాటు పల్స్ అందలేదనీ తెలిసింది. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందనీ వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
నందమూరి కుటుంబం నుంచి హీరోగా తొలి షాట్‌తోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన హీరో తారకరత్న. వస్తూ వస్తూనే సింగిల్ డేలో ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రారంభించి రికార్డు సృష్టించాడు.
అయితే, ఆ తర్వాత కెరీర్ నత్తనడకనే సాగింది తారకరత్నకు. ఒకానొక టైమ్‌లో పూర్తిగా సినిమాలకు దూరమైన తారకరత్న ఈ మధ్యనే మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. అలాగే, పొలిటికల్‌గానూ హుషారుగా కనిపిస్తున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఫ్యాన్స్‌ని కలవరపాటుకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?