విమానంలో శిశువు జన్మిస్తే.. పౌరసత్వం, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయా?

- January 28, 2023 , by Maagulf
విమానంలో శిశువు జన్మిస్తే.. పౌరసత్వం, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయా?

యూఏఈ: విమానంలో శిశువు జన్మిస్తే.. వైద్య అవసరాల నుండి పౌరసత్వంతో సహా చట్టపరమైన చిక్కుల వరకు ఎదురవుతాయా..  విమానంలో జన్మించిన శిశువులకు జీవితాంతం ఉచిత విమాన సర్వీసులు లభిస్తాయా.. ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఇలాంటి సందేహాలపై  విమానయాన రంగ నిపుణులు స్పందిస్తూ.. యూఏఈ ఆధారిత క్యారియర్‌లు ఏవీ విమానంలో జన్మించిన శిశువులకు ఉచిత విమాన సర్వీసులను అందించలేదని పేర్కొన్నారు. ఇటీవల టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్‌కి వెళ్తున్న EK319 విమానంలో ఒక మహిళ ప్రసవించింది. 12 గంటల అనంతరం ఫ్లైట్ దుబాయ్‌కి వచ్చింది.  ల్యాండింగ్ తర్వాత తల్లి, బిడ్డలను ఆస్పత్రికి తరలించారు.

కాగా, సెప్టెంబర్ 15, 2020న కైరో నుండి లండన్ వెళ్లే విమానంలో గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ప్రసవ నొప్పి వచ్చిందని విమానయాన నిపుణుడు, పైలట్ -ఫ్లయింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ ది కాక్‌పిట్ పుస్తక రచయిత హాన్స్-జార్జ్ రబాచెర్ అన్నారు. ఈజిప్ట్ ఎయిర్‌ గాలిలో ఉండగానే ఆమె ప్రసవించింది.ఆ తర్వాత శిశువుకు జీవితాంతం ఉచిత విమాన సర్వీసులు అందిస్తామని ఈజిప్ట్ ఎయిర్‌ ప్రకటించింది. దీన్ని ఎయిర్ లైన్ మార్కెటింగ్ చర్యలో భాగంగానే ప్రకటించింది. కానీ విమానం గాలిలో ఉండగానే జన్మించిన శిశువులకు జీవితాంతం ఉచిత విమానాలను అందించాల్సిన బాధ్యత ఏ ఎయిర్‌లైన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా గర్భం దాల్చిన 8వ నెల వరకు ప్రయాణించడం మహిళలకు సురక్షితం. ఇతర సమస్యలు లేని గర్భిణీ స్త్రీ 32 వారాల వరకు సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఎయిర్‌లైన్‌కు ఎటువంటి అభ్యంతరాలు లేదా పాలసీ పరిమితులు లేవని షార్జాలోని ఆస్టర్ హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ ప్రసూతి, గైనకాలజీ డాక్టర్ జెస్సికా సెలీనా ఫెర్నాండెజ్ అన్నారు. ప్రతి విమానయాన సంస్థ సురక్షితంగా ప్రయాణించడానికి వేర్వేరు కటాఫ్‌లను కలిగి ఉంటుందని, కొన్ని ఆరోగ్య సంరక్షణ నిపుణుల క్లియరెన్స్‌తో 36 వారాల వరకు విమాన ప్రయాణాన్ని అనుమతిస్తాయని తెలిపారు. విమానయాన సంస్థలు తమ శిక్షణా పోర్ట్‌ఫోలియోలలో విమానంలో ప్రసవాలను చేర్చాలా వద్దా అనే దానిపై నిబంధనలు లేనందున, ప్రసవం కోసం తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలా వద్దా అనేది ఎయిర్‌లైన్‌పై ఆధారపడి ఉంటుందని హన్స్-జార్జ్ చెప్పారు. శిశువు జాతీయత గురించి సమస్య తలెత్తుతుందని హాన్స్-జార్జ్ చెప్పారు.  గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణించడానికి వేర్వేరు విమానయాన సంస్థలు వేర్వేరు నియమాలను కలిగి ఉంటాయన్నారు. ఎయిర్ అరేబియా గర్భిణీ స్త్రీలను వారి 35వ వారం చివరి వరకు సింగిల్ ప్రెగ్నెన్సీలకు.. 32వ వారం వరకు బహుళ గర్భాల వారికి.. వారాల సంఖ్యను తెలిపే మెడికల్ సర్టిఫికేట్‌ను అందజేస్తే..  విమానంలో ప్రయాణించడానికి అనుమతిస్తుందని తెలిపారు. గర్భం దాల్చిన 29వ వారం నుండి వైద్య ధృవీకరణ పత్రాలను ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ అడుతుతున్నాయన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com