నాన్-స్టాప్ వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు

- January 28, 2023 , by Maagulf
నాన్-స్టాప్ వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు
యూఏఈ: యూఏఈ అంతటా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రకారం, అస్థిర వాతావరణ పరిస్థితులు శనివారం తక్కువగా ఉంటాయని, కొన్ని ఉత్తర-తూర్పు తీర ప్రాంతాలలో పగటిపూట వర్షం పడే అవకాశం ఉంది.  అయితే ఆదివారం వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అబుధాబి నగరం, శివార్లు అల్ మురూర్, అల్ బహియా, అల్ బహ్రానీ ద్వీపం, అబుధాబిలోని అల్ హుదైరియత్ ద్వీపంతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అల్ దఫ్రా ప్రాంతంలో అల్ మిర్ఫా,  రాస్ అల్ ఖైమాలోని వాడి షిహా, ఉమ్ అల్ క్వైన్‌లోని అల్ సలామా, దుబాయ్‌లో జుమేరా, లహబాబ్, షార్జా, అజ్మాన్‌లలో వర్ష ప్రభావం అధికంగా ఉంది.
 
రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్‌లో తెల్లవారుజామున 1:45 గంటలకు అత్యల్ప ఉష్ణోగ్రత 2.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. రస్ అల్ ఖైమాలోని జెబెల్ మెబ్రాలో 5.1 డిగ్రీల సెల్సియస్, అల్ రహ్బా పర్వతంలో 5.1 డిగ్రీల సెల్సియస్, జెబెల్ అల్ హబాన్‌లో 8.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఫుజైరాలోని ధడ్నాలో అత్యధికంగా 88.2 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా.. ఆ తర్వాత షార్జాలోని సర్ బు నాయర్ ద్వీపంలో 86.3 మిమీ నమోదైంది.  వర్షపాతం , దుమ్ము-ప్రేరేపిత గాలుల సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, పెద్ద నీటి కుంటలు, వరదలు ఉన్న లోయల నుండి దూరంగా ఉండాలని ఎన్సీఎం పిలుపునిచ్చింది.
  
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com