మసీదులో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి
- January 30, 2023
పాకిస్తాన్: పాక్ లో భారీ పేలుడు జరిగింది. మసీదులో బాంబు పేలడంతో 28 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ సిటీలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ఉన్న మసీదులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనలు చేసేందుకు 260 మంది వరకు రాగా..ప్రార్థనలు చేస్తున్న టైములో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబ్డాయి. ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా జనం ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లింది. పేలుడు తర్వాత మసీదు భవనంలోని కొంత భాగం దెబ్బతిని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు పోలీస్ అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెషావర్‌లోని సమీప ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. గతేడాది మార్చిలో పెషావర్ లోనే షియాలకు చెందిన మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి చేయగా.. 64 మందికి పైగా చనిపోయారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







