సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్, పుతిన్ సమీక్ష
- January 31, 2023
రియాద్: సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్, పుతిన్ సమీక్షించారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ కాల్ సందర్భంగా సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని పెంపొందించే మార్గాలను ఇరుపక్షాలు సమీక్షించారు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వాన్ని అందించడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాల ఒపెక్ + గ్రూప్‌లో సహకారం గురించి చర్చించడానికి అధ్యక్షుడు పుతిన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో మాట్లాడినట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంధనం, వాణిజ్యం, ఆర్థికం, రాజకీయ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి క్రౌన్ ప్రిన్స్ తో పుతిన్ మాట్లాడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







