సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్, పుతిన్ సమీక్ష

- January 31, 2023 , by Maagulf
సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్, పుతిన్ సమీక్ష

రియాద్: సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్, పుతిన్ సమీక్షించారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ కాల్ సందర్భంగా సౌదీ-రష్యన్ ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని పెంపొందించే మార్గాలను ఇరుపక్షాలు సమీక్షించారు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వాన్ని అందించడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాల ఒపెక్ + గ్రూప్‌లో సహకారం గురించి చర్చించడానికి అధ్యక్షుడు పుతిన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో మాట్లాడినట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంధనం, వాణిజ్యం, ఆర్థికం, రాజకీయ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి క్రౌన్ ప్రిన్స్ తో పుతిన్ మాట్లాడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com