ఏవండోయ్ నానీ గారూ.! అయ్యో పాపం టార్గెట్ అయిపోయారూ.!
- January 31, 2023
నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా మార్చి 3న రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేశాడు నాని. ఈ క్రమంలోనే ‘దసరా’ ట్రైలర్ లాంఛ్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నాని కాస్త నోరు జారాడు.
‘దసరా’ సినిమాపై మరీ ఎక్కువ అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు. అంచనాలు పెంచేస్తే ఫర్వాలేదు. ఏకంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టింది. ఈ ఏడాదికి ‘దసరా’ అలాంటి సినిమా అవుతుందంటూ, తన సినిమాని ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’తో పోల్చేశాడు.
అదే జనానికి ఎక్కడో కాలింది. అన్నట్లు ‘దసరా’ ప్యాన్ ఇండియా సినిమా. ఎంత ప్యాన్ ఇండియా అయితే మాత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోలికేంటీ.? నానీ గారూ..! మీరు కాస్త తగ్గితే బెటరూ.. అంటూ నెటజిన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!