ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- January 31, 2023న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) లో భారత ఎకానమీ కాస్త నెమ్మదించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశ్ పెట్టనున్న నేపథ్యంలో కీలక అంచనాలను వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ కు సంబంధించిన జనవరి అప్ డేట్ ను మంగళవారం రిలీజ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6.1కి పరిమితమవుతుందని చెప్పింది.
ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.9 శాతానికి పడిపోతుందని వెల్లడించింది. అదే 2024లో పెరిగి.. 3.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.
‘‘ఇండియా విషయంలో అక్టోబర్ ఔట్ లుక్ తో పోలిస్తే.. మా అంచనాలేమీ మారలేదు. అయితే బాహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు’’ అని అని చీఫ్ ఎకనమిస్ట్, ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ పియర్రీ ఒలీవియర్ గౌరించస్ అభిప్రాయపడ్డారు. 2023లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటా చైనా, భారత్ దేనని చెప్పారు. అమెరికా, యూరప్ ప్రాంతాలు కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడుతాయని వెల్లడించారు.
2023లో చైనా జీడీపీ 5.2 శాతానికి పెరుగుతుందని, 2024 లో మాత్రం 4.5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇక అమెరికా గ్రోత్ 1.4 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. భారత్ లో ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని, వచ్చే ఏడాది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని వివరించింది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల