‘శాకుంతలం’ వాయిదా: ఈ షాక్ దిల్ రాజుకా.? సమంతకా.?

- February 01, 2023 , by Maagulf
‘శాకుంతలం’ వాయిదా: ఈ షాక్ దిల్ రాజుకా.? సమంతకా.?

సమంత లీడ్ రోల్‌ పోషించిన సినిమా ‘శాకుంతలం’. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఫిమేల్ లీడ్ పోషించగా, గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 3డీ టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్‌లోనే రిలీజ్ కావల్సి వుంది. కానీ, ఫిబ్రవరి 17కు వాయిదా పడింది.

ఇప్పుడు ఈ డేట్ కూడా పోస్ట్‌పోన్ కానుందన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పోస్ట్‌పోన్ గాసిప్స్.. రాజుగారిపై మరింత ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాతో తెగ ఓవరాక్షన్ చేసిన దిల్ రాజుకు లాస్ట్ మినిట్‌లో గట్టి షాకే తగిలింది. అనుకున్న డేట్‌కి ఆ సినిమాని రిలీజ్ చేయలేకపోయారు దిల్ రాజు. అలాగే, ఇప్పుడు ‘శాకుంతలం’ కూడా పోస్ట్ పోన్ అయ్యిందంటే, రాజుగారికి దెబ్బ పడ్డట్లే. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!

మరోవైపు ఇటీవలే ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి తేరుకుని ఈ మధ్యనే షూటింగులు షురూ చేసింది. ఈ టైమ్‌లో ‘శాకుంతలం’ అనుకున్న టైమ్‌కి రిలీజ్ అవ్వడం సమంతకీ కీలకమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com