ఏపీ గర్భిణులకు సీఎం జగన్ శుభవార్త
- February 03, 2023
అమరావతి: రాష్ట్రంలోని గర్భిణులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామాలిటీస్) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకరాబోతున్నట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు.
ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలవుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్నచోట ఈ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకష్టమని అన్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు.
రీసెంట్ గా తెలంగాణ లో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఫ్రీ గా టిఫా స్కానింగ్ సెంటర్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలుగనుంది. ప్రైవేటులో రూ.2 నుంచి 3 వేలు ఖర్చయ్యే ఈ స్కానింగ్ ఇకపై ఉచితంగా సర్కారు దవాఖానల్లో చేయనున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







