అన్‌స్టాపబుల్.! బాలయ్య 90 పర్సంట్, పవన్ కళ్యాణ్ 10 పర్సంట్.!

- February 03, 2023 , by Maagulf
అన్‌స్టాపబుల్.! బాలయ్య 90 పర్సంట్, పవన్ కళ్యాణ్ 10 పర్సంట్.!

సహజంగానే టాక్ షో అంటే ప్రశ్నలు అడగడమే హోస్ట్ పని.. దానికి వివరంగా సమాధానాలు చెప్పడం గెస్ట్ పని. కానీ, కనీ వినీ ఎరుగని విధంగా బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మాత్రం బాలయ్య 90 పర్సంట్ మాట్లాడితే, పవన్ కళ్యాణ్ 10 పర్సంట్ మాత్రమే మాట్లాడారు.

అసలు వివరాల్లోకి వెళితే, అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్‌తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఊహించిన దానికి మించి ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. జస్ట్ టాక్ షో అనేలా కన్నా, అదో కొత్త సినిమా అన్నట్లుగా క్యూరియాసిటీతో వీక్షించేశారీ ఎపిసోడ్‌ని.

పవన్ కళ్యాణ్ గురించి కానీ, ఆయన మూడు పెళ్లిళ్ల గురించి కానీ ఇకపై ఎవరైనా మాట్లాడితే, వాళ్లు ఊరకుక్కలతో సమానం.. అని బాలయ్య ఈ సందర్భంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అలాగే, బాలయ్య, పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన ఎలివేషన్లూ, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పిన నిజాలు అందర్నీ ఆకట్టుకున్నాయ్. ఓవరాల్‌గా ‘ఆహా’ హిస్టరీలోనే పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సూపరో సూపర్ అంతే. అన్నట్టు ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ వుందండోయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com