హైదరాబాద్ లో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు

- February 04, 2023 , by Maagulf
హైదరాబాద్ లో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు

హైదరాబాద్: హైదరాబాద్ లో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టయ్యింది. ముఖ తెలుగు డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.సురేష్ బోయిన 2017 నుంచి ప్రముఖ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు.సురేష్ బోయినతో పాటు అఖిల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశం ఇస్తామని సురేష్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. సురేష్ హైదరాబాద్ లో ప్రముఖులకు యువతులను పంపుతున్నట్లు గుర్తించారు.అలాగే గోవా, బెంగళూరులోనూ సురేష్ వ్యభిచారం నిర్వహించారు. ముంబై, ఢిల్లీ, బెంగాల్ నుంచి అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.అమ్మాయిల ఫోటోలను ఆన్ లైన్ లో పెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com