ప్రవాస దంపతులకు శుభవార్త... సౌదీలో మ్యారేజ్ సర్టిఫికేట్ పొందే అవకాశం
- February 05, 2023
జెడ్డా: ప్రవాసులకు సౌదీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ప్రవాసులు తమ మ్యారేజ్ సర్టిఫికేట్ ను సౌదీ కోర్టుల నుంచి పొందవచ్చు. అయితే, వధువు తండ్రి సౌదీలో నివాసం ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని సౌదీ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రవాస దంపతులు సౌదీని విజిట్ విసా లేదా ట్రాన్సిట్ వీసా ద్వారా సందర్శించిన సమయంలో తమ వివాహ ఒప్పందాన్ని పొందవచ్చని తెలిపింది. భార్యాభర్తలు నజీజ్ సెంటర్ ఫర్ జ్యుడీషియల్ సర్వీసెస్ ద్వారా తమ వివాహాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అన్ని మంత్రిత్వ శాఖ సేవలను అందించే నజీజ్ పోర్టల్ ద్వారా ఈ సర్వీస్ ప్రయోజనాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ సేవ కోసం విధానాలను పూర్తి చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …