కువైట్ వీసా యాప్: వీసా ఫోర్జరీ అడ్డుకట్ట!
- February 05, 2023
కువైట్: కువైట్ ప్రభుత్వం త్వరలో కార్మికుల కోసం కువైట్ వీసా యాప్, స్మార్ట్ ఐడిలను ప్రారంభించనుంది. వీటి సాయంతో వీసా ఫోర్జరీ, వీసా ట్రాఫికింగ్ లను అరికట్టడంలో సహాయపడుతుందని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ "కువైట్ వీసా" అప్లికేషన్ కార్మికుడు వారి స్వదేశం నుండి విమానం ఎక్కే ముందు అన్ని ఎంట్రీ వీసాలను చెల్లుబాటు చేస్తుందన్నారు. కువైట్‌వీసా యాప్ దేశంలోకి కార్మికుల ప్రవేశాన్ని సురక్షితం చేస్తుందన్నారు. త్వరలో ప్రారంభించే షేక్ తలాల్ అల్-ఖలీద్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (స్మార్ట్ ఎంప్లాయ్ ఐడి) యాప్ లో కార్మికుడికి సంబంధించిన అధికారిక సమాచారం మొత్తం ఉంటుందన్నారు. ఇవి అమల్లోకి వస్తే వీసా ఫోర్జరీ, వీసా ట్రాఫికింగ్ లకు అడ్డుకట్ట పడుతుందని అల్-ఖాలీద్ అశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …