పింక్ కారవాన్ రైడ్: దుబాయ్ లో కీలక రోడ్లు మూసివేత

- February 05, 2023 , by Maagulf
పింక్ కారవాన్ రైడ్: దుబాయ్ లో కీలక రోడ్లు మూసివేత

యూఏఈ: పింక్ కారవాన్ రైడ్ నేపథ్యంలో దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(RTA) ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. ఫిబ్రవరి 5న పలు కీలక రహదారులను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. అలాగే పలు కీలక రహదారులలో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనను కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న పింక్ కారవాన్ రైడ్ దుబాయ్ లో సాగే ర్యాలీను మూడు స్టేజీలుగా విభజించారు. పింక్ ర్యాలీ సాగే సమయాల్లో రహదారులు మూసివేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని కోరింది.

స్టేజ్ 1: ఉదయం 8 నుండి 10.30 వరకు

ప్రభావిత రహదారులు: అల్ సుకూక్ స్ట్రీట్, అల్ బౌర్సా స్ట్రీట్, అల్ ముస్తక్బాల్ స్ట్రీట్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ Blvd, అల్ యమామా స్ట్రీట్

స్టేజ్ 2: 11.15am నుండి 1pm వరకు

ప్రభావిత రహదారులు: కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్, ది వాక్ ఎట్ JBR.

స్టేజ్ 3: మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు

ప్రభావిత రహదారులు: అల్ ముల్తాకా 1 స్ట్రీట్, అల్ ఎంజాజ్ స్ట్రీట్, హ్యాపీనెస్ స్ట్రీట్, అల్ మదీనా స్ట్రీట్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com