యూకే-భారత్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొన్న యూకే ప్రధాని రిషి సునక్
- February 05, 2023
లండన్: యూకే జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బ్యూరోతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో ప్రత్యేకంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా పాల్గొనడం గమనార్హం. కొన్ని రోజులుగా అజిబ్ బోభాల్ విదేశాల్లో పర్యటిస్తున్నారు.
పలు దేశాల అధికారులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టిమ్ బ్యారోతో సమావేశమై ఇరు దేశాల భద్రత, వాణిజ్యం, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. ఆయా అంశాల్లో భారత్-యూకే బంధం బలపడడానికి రిషి సునక్ హామీ ఇచ్చారు. యూకే కేబినెట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఇందులోనే రిషి సునక్ కూడా పాల్గొన్నారంటూ భారత హై కమిషన్ ట్విట్టర్ లో తెలిపింది. త్వరలోనే టిమ్ కూడా భారత్ లో పర్యటిస్తారని వివరించింది. గత మంగళవారం అమెరికాలో పర్యటించిన అజిత్ డోభాల్ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







