రుణం ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు వ్యక్తులకు dh360,000 జరిమానా, జైలుశిక్ష

- February 05, 2023 , by Maagulf
రుణం ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు వ్యక్తులకు dh360,000 జరిమానా, జైలుశిక్ష

దుబాయ్: బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తామని ఒక ఆఫ్రికన్ పెట్టుబడిదారుని మోసం చేసిన ఆసియాకు చెందిన ఇద్దరు పెట్టుబడిదారులకు దుబాయ్ కోర్టు భారీ జరిమానా, జైలుశిక్ష విధించింది. మోసానికి పాల్పడ్డ నిందితులకు రెండు నెలల జైలు శిక్షతోపాటు సంయుక్తంగా $100,000 (Dh367,310) జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక దక్షిణాఫ్రికా పెట్టుబడిదారుడు తనను ఇద్దరు ఆసియన్లు మోసగించారని కేసు పెట్టారు. నిందితుల్లో ఒకరు మరొకరి హామీతో స్థానిక బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో తన సహాయాన్ని అందిస్తామని ముందుకొచ్చారని పేర్కొన్నారు. Dh500,000 కమీషన్ చెల్లిస్తే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని మోసం చేశారని తెలిపారు. దుబాయ్‌లోని అనేక మంది పెట్టుబడిదారులకు తమ వ్యాపారాలను విస్తరించడానికి సహాయం చేసినట్లు నిర్ధారించే పత్రాలను చూపించిన రెండవ నిందితుడిని తాను కలిశానని బాధితుడు చెప్పాడు. స్థానిక బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉన్న పరిచయస్తులు, స్నేహితులు ఉన్నట్లు కూడా నిందితులు మాట్లాడారని ఆయన తెలిపారు. కేసు ఫైల్ ప్రకారం.. పెట్టుబడిదారుడు నిందితులకు, తనకు మధ్య జరిగిన పత్రాలు, సంభాషణలను కోర్టుకు సమర్పించారు. అతను మొదటి నిందితుడి భార్యకు $100,000 బదిలీ చేసినట్లు రుజువు చేసే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను కూడా సమర్పించారు. కేసును విచారించిన కోర్టు నిందితులకు జరిమానా, జైలుశిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com