నకిలీ ఇన్‌వాయిస్‌లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ

- February 05, 2023 , by Maagulf
నకిలీ ఇన్‌వాయిస్‌లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ

యూఏఈ: పనిచేసిన కంపెనీ నుండి 431,932 దిర్హామ్‌లను దొంగిలించడానికి నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించిన ఉద్యోగిని దోషిగా కోర్టు తేల్చింది. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యక్తి తన మాజీ యజమాని నుండి అపహరించిన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేసే తన మాజీ ఉద్యోగి నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధులను కాజేసిండని కంపెనీ దావా వేసింది. కాజేసిన 431,932 దిర్హామ్‌లతోపాటు నష్టపరిహారం కింద  120,000 దిర్హాములను ఇప్పించాలని కంపెనీ తన దావాలో డిమాండ్ చేసింది. అబుదాబి క్రిమినల్ కోర్ట్ అంతకుముందు సదరు ఉద్యోగిని దోషిగా నిర్ధారించి, అపరాధ రుసుముతో శిక్ష విధించింది. కంపెనీకి జరిగిన నష్టాలకు తాత్కాలిక పరిహారంగా 51,000 దిర్హామ్‌లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసును పరిశీలించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆ వ్యక్తి కంపెనీ నుండి దొంగిలించిన 431,932 దిర్హామ్‌లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కంపెనీ చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com