రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్
- February 06, 2023
హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు. సభలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
బడ్జెట్ హైలెట్స్
షెడ్యూల్ తెగలకు రూ.15, 233 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
- దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
- రైతు వేదికలకు రూ. 26 835 కోట్లు
- నీటి పారుదల రంగానికి రూ. 26, 831 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.12, 727 కోట్లు
- ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు
- 2023-24 తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేల 175
- రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు
- మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం