విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8343 మంది భారతీయులు:కేంద్ర మంత్రి వి.మురళీధరన్
- February 06, 2023
న్యూ ఢిల్లీ: విదేశీ జైళ్లల్లో మొత్తం 8343 మంది భారతీయ ఖైదీలున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. వీరిలో విచారణ ఎదుర్కొంటున్న అండర్ట్రైల్ ఖైదీలు కూడా ఉన్నారన్నారు. విదేశాల్లోని భారతీయ ఖైదీల భద్రతకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. యూఏఈలో అత్యధికంగా 1929 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. సౌదీ అరేబియా జైళ్లల్లో 1362 మంది మగ్గుతున్నారు. నేపాల్లో 1222 మంది భారతీయ ఖైదీలున్నారు. ఇక.. విదేశాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని స్వదేశానికి తరలించేందుకు 31 దేశాలతో భారత్ ఒప్పందాలను చేసుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం