చైతూకి హ్యాండిచ్చి రౌడీకి ఫిక్సయిపోయిన పరశురామ్.!
- February 06, 2023
‘సోలో’, ‘గీత గోవిందం’ తదితర చిత్రాలతో డైరెక్టర్‌గా మంచి ఫేమ్ దక్కించుకున్న పరశురామ్, తాజాగా రౌడీతో తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గతంలో ‘గీత గోవిందం’తో సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ కాంబో.
ప్రస్తుతం ‘లైగర్’ ఫ్లాప్‌తో సైలెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండకు పరశురామ్ ప్రాజెక్ట్ బూస్టప్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘గీత గోవిందం 2’ అవుతుందని అంచనాలేసేస్తున్నారు.
కాగా, ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ అద్దాలని ఫ్యాన్స్ కోరుతున్నారట. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మండన్నాని భాగం చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే, ఫ్యాన్స్ కోరుకున్నట్లే ఇది మరో ‘గీత గోవిందం’ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా హిట్ కొట్టాలన్న కసితో వున్న రౌడీ కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్కీ ఛామ్ రష్మికతో ముచ్చటగా మూడోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధంగానే వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సేమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …