ఒమన్ కు భారీగా పర్యాటకులు.. ఈ సీజన్ లో 200 క్రూయిజ్ షిప్‌ల రాక!
- February 06, 2023
మస్కట్: 2022-2023 సీజన్‌లో ఒమన్‌ను సందర్శించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, దాదాపు 200 వరకు క్రూయిజ్ షిప్ లు వచ్చే అవకాశం ఉందని హెరిటేజ్ మంత్రిత్వ శాఖలోని పర్యాటక నమూనాల విభాగం డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ అల్ అజ్రీ అన్నారు. COVID-19 మహమ్మారి కంటే ముందు పర్యాటక సీజన్‌లలో ఒమన్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య 280,000కి దాటిందని ఖలీద్ మొహమ్మద్ అల్ అజ్రీ చెప్పారు. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖలో టూరిజం ప్రమోషన్ డైరెక్టర్ జనరల్ హైతం మొహమ్మద్ అల్ ఘస్సానీ మాట్లాడుతూ.. ఒమన్‌లో శీతాకాలం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుందని, ఆ సమయంలో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారన్నారు. ఇప్పటికే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు, ఈవెంట్‌లు, ఫెస్టివల్స్ ప్రకటించిందన్నారు. వాటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. నార్త్ అల్ షర్కియాలోని ఎడారి అడ్వెంచర్స్ ఫెస్టివల్, ఐరన్‌మ్యాన్ ఈవెంట్ లు పర్యాటకులను అలరిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడంలో క్రూయిజ్ లైనర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, ఒమన్‌లో క్రూయిజ్ షిప్‌ల రద్దీని పెంచడానికి హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!