టర్కీ,సిరియాలో 4 వేలు దాటిన మరణాలు.. సహాయక చర్యలకు ఆటంకం

- February 07, 2023 , by Maagulf
టర్కీ,సిరియాలో 4 వేలు దాటిన మరణాలు.. సహాయక చర్యలకు ఆటంకం

యూఏఈ: సోమవారం టర్కీ, వాయువ్య సిరియాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా 4,400 మందికి పైగా మరణించారు.గడ్డకట్టే శీతాకాల వాతావరణం సహాయక చర్యలు చేపట్టిన బృందాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకపం ధాటికి టర్కిష్ నగరాల్లోని మొత్తం అపార్ట్‌మెంట్ బ్లాకులు నేలమట్టం అయ్యాయి. అదే సమయంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన మిలియన్ల మంది సిరియన్లకు తాజా భూకంపం మరింత నష్టాన్ని మిగిల్చింది. ఈ శతాబ్దంలో టర్కీని తాకిన అత్యంత భయంకరమైన భుకంపం ఇదే. తెల్లవాుఝామున వచ్చిన భూకంపం నుంచి టర్కీ ప్రజలు తేరుకోకముందే  మధ్యాహ్నం సమయంలో మరోసారి 7.7 తీవ్రతతో  పెద్ద భూకంపం సంభవించింది. రెండోసారి వచ్చిన భూకంపం టర్కీ లో ప్రాణనష్టాన్ని విపరీతంగా పెంచింది. అధిక సంఖ్యలో భవనాలు నేలమట్టం అయి.. భారీగా ప్రాణనష్టం జరింగింది.

నివాళులర్పించిన ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల దౌత్యవేత్తలు టర్కీ, సిరియాలో భూకంప బాధితులకు సోమవారం నివాళులర్పించారు. జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సబా కరోసి (Csaba Kőrösi) రెండు దేశాల ప్రభుత్వానికి, ప్రజలకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సిరియా, టర్కీ ప్రజలకు యూఏఈ సహాయం
సిరియా, టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి "Gallant Knight / 2" ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు యూఏఈ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో సాయుధ దళాల భాగస్వామ్యం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ లు అంతర్జాతీయ సహకారం అందిస్తాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com