ప్రైవేట్ కంపెనీలలో ఎమిరటైజేషన్: నిబంధనలను సవరించిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: దేశంలోని ప్రైవేట్ రంగంలో ఎమిరేటైజేషన్ పథకంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ యూఏఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక లక్ష్యాన్ని రెండు విభాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఆరు నెలల్లో 1 శాతం, రెండవ ఆరు నెలల్లో మిగిలిన 1 శాతాన్ని పూర్తి చేయాలి. ఫెడరల్ చట్టం 2026 చివరి నాటికి 10 శాతానికి చేరుకోవడానికి ఏటా 2 శాతం ఎమిరేటైజేషన్ రేట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి కంపెనీలు 2 శాతం ఎమిరాటీలను నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించాలి. UAE మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2022లో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలకు 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను విధించింది. 2022 సంవత్సరంలో దాదాపు 9,293 కంపెనీలు ఎమిరటైజేషన్ లక్ష్యాలను సాధించాయి. 50,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, 'నఫీస్' కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 28,700 మంది ఎమిరాటీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







