టర్కీ-సిరియా భూకంపం: వైద్య, రెస్క్యూ బృందాలను పంపిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: టర్కీ-సిరియా భూకంప బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు సహాయక బృందాలకు సూచించారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వ్యక్తుల కోసం ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ను పంపాలని ఆదేశించారు. అలాగే సిరియన్ అరబ్ రిపబ్లిక్లో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి అత్యంత కష్టతరమైన ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడానికి రెస్క్యూ బృందాన్ని, అత్యవసర సహాయ సామాగ్రి, అత్యవసర సహాయాన్ని అందించాలని షేక్ మొహమ్మద్ ఆదేశించారు. భారీ భూకంపాల కారణంగా వేలాది మంది మరణించారు. ఈ రెండు దేశాలకు, వారి ప్రజలకు, యూఏఈ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఈ విపత్తులో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







