అబుధాబిలో ఒమన్-యూఏఈ సైనిక విన్యాసాలు ప్రారంభం
- February 07, 2023
అబుధాబి: కోఆపరేషన్-3 అనే కోడ్‌నేమ్‌తో ఒమన్-యూఏఈ సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారం అబుధాబిలో ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 16, 2023న ముగిసే 11 రోజుల డ్రిల్‌లో మస్కట్ రెజిమెంట్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO)కి చెందిన ఇన్‌ఫాంట్రీ బ్రిడ్జ్ (23), దాని సహాయక విభాగాలు, అలాగే ఒమన్ వైమానిక దళం (RAFO)కు చెందిన విమానాలు కూడా పాల్గొంటున్నాయి. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) నుండి నౌకలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సాయుధ దళాలకు మూడు విభాగాల (నావికా, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ) సైనికులు ఈ సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నారు. అరబ్, స్నేహపూర్వక దేశాల సహకారంతో RAO, RAFO, RNO ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తాన్ సాయుధ దళాల (SAF)చే నిర్వహించబడే వార్షిక శిక్షణా కార్యక్రమం సందర్భంగా ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..







