మెంతులతో సౌందర్యం.! ఇది విన్నారా.?
- February 07, 2023మెంతులు.. వంటింటి దినుసుల్లో ఓ ముఖ్యమైన దినుసు. కాస్త చేదుగా వుండే ఈ మెంతులు వంటలకు మంచి రుచినిస్తుంటాయ్. వంటలకు రుచిని అందించడమే కాదండోయ్. ఆరోగ్యానికీ, చర్మ సౌందర్యానికీ ఎంతో మేలు చేస్తుంటాయ్.
చర్మం మీద ముడతలు పోగొట్టే శక్తి మెంతులకు చాలా ఎక్కువగా వున్నట్లు అధ్యయనాల్లో తెలిసింది. మెంతులు మరిగించిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, వయసుతో పాటూ వచ్చే ముడతల్ని నివారించుకోవచ్చునట.
మెంతుల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా వుంటాయ్. ఇవి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏదో ఒక రకంగా మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అలాగే చుండ్రు సమస్యను నివారించడంలో మెంతులు చాలా శక్తివంతంగా పని చేస్తాయట. రాత్రి నీళ్లలో నానబెట్టిన మెంతుల్ని తెల్లారి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి తలకు పట్టిస్తే, చుండ్రుతో పాటూ, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం