ప్రబాస్-కృతిసనన్ ఎంగేజ్‌మెంట్ అంట.! చెప్పిందెవరో తెలుసా.?
- February 07, 2023
ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదండోయ్. ఆయన పెళ్లి కూడా ఓ జాతీయ సమస్యే. ప్రబాస్ పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే హీరోపైనా రాలేదంటే అతిశయోక్తి కాదేమో.
మొన్నటి వరకూ స్వీటీ అనుష్కతో ప్రబాస్ పెళ్లంటూ వార్తలు.. ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్‌ని కృతి సనన్ భర్తీ చేస్తోంది. కొన్ని నెలలుగా ప్రబాస్, కృతి సనన్ పెళ్లంటూ వార్తలు తెగ గుప్పుమంటున్నాయ్. వాటిని ఖండిస్తూ వస్తున్నారీ ఇద్దరూ.
అయితే, తాజాగా ప్రబాస్ పెళ్లి మీద మరో బ్రేకింగ్ న్యూస్ ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలోనే ప్రబాస్, కృతి సనన్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారట.. అంటూ ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశాడు ఓ మహానుభావుడు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ రివ్యూయర్ ఉమర్ సంధు.
అమెరికాలో వుంటూ అక్కడి నుంచి సినిమాల రివ్యూలను ముందుగానే రివీల్ చేస్తుంటాడీ వ్యక్తి. ఈ వ్యక్తికి ప్రబాస్ పెళ్లితో ఏం సమస్యట. త్వరలోనే కృతి సనన్, ప్రబాస్ ఎంగేజ్‌మెంట్ మాల్దీవుల్లో జరగబోతోంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేశారీయన. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అయిపోయింది.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







