కార్మికుల లీగల్ స్టేటస్ కరెక్షన్: తుది గడువును నిర్దేశించిన బహ్రెయిన్
- February 07, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని సక్రమంగా లేని కార్మికులందరికీ.. ఫ్లెక్సీ పర్మిట్ హోల్డర్లు మార్చి 4 లోపు వారి చట్టపరమైన స్థితి(లీగల్ స్టేటస్)ని సరిచేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) పిలుపునిచ్చింది. LMRA చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారందరిపై సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరించింది. కింగ్‌డమ్‌లోని కార్మికులు గడువు ముగిసిన, చెల్లని లేదా ఫ్లెక్సీ పర్మిట్లను కలిగి ఉన్నవారు, లేబర్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి అర్హులని LMRA సూచించింది. క్రిమినల్ నేరాలు ఉన్నవారు, ప్రస్తుత పర్మిట్లలో నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఈ అవకాశం లేదని అథారిటీ తెలిపింది. ఆమోదించబడిన నమోదు కేంద్రాల ద్వారా లేదా LMRA వెబ్సైట్(www.lmra.bh)ని సందర్శించడం ద్వారా లేబర్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌కు అర్హతను ధృవీకరించుకోవాలని కార్మికులకు సూచించింది. సందేహాల నివృత్తికి LMRA కాల్ సెంటర్‌ను +973 17103103, +973 33150150 లలో సంప్రదించాలని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







