ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ గుట్టురట్టు
- February 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను అడిషనల్ సీపీ గజరాజ్ భూపాల్ మీడియాకు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా టోఫెల్ ఎగ్జామ్ తప్పనిసరి. ఆన్లైన్లో జరుగుతున్న ఎగ్జామ్ ని కొందరు కేటుగాళ్లు కాపీ చేశారు.
పెద్ద ఎత్తున మాస్ కాపీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్న ఆన్లైన్ టోల్ మాస్ కాపీయింగ్ లో రెండు గ్యాంగులకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరోవైపు, కొందరు విద్యార్థుల ఫీజు చెల్లింపుల్లో గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలో క్రెడిట్ కార్డ్ స్కాం వెలుగులోకి రావడంతో ఇక్కడా పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే మోసపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా దాదాపు రూ.కోటిన్నరకు పైగా మోసానికి పాల్పడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!







