2,000 ఏళ్ల పురాతన నాబాటియన్ మహిళ పునర్నిర్మాణం

- February 08, 2023 , by Maagulf
2,000 ఏళ్ల పురాతన నాబాటియన్ మహిళ పునర్నిర్మాణం

బహ్రెయిన్: రాయల్ కమీషన్ ఫర్ అల్ ఉలా (RCU) ఆధ్వర్యంలో పని చేస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, మోడల్ మేకింగ్ రంగాల్లోని పురావస్తు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల బృందం, మొట్టమొదటిసారిగా ఒక పురాతన నబాటియన్ నాగరికతకు చెందిన  మహిళ ముఖాన్ని పునర్నిర్మించింది. నబాటియన్ మహిళను 'హినాట్' అని పిలుస్తారు. సౌదీ అరేబియాలోని హెగ్రా సమాధిలో 2,000 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక ప్రముఖ మహిళగా నిపుణులు భావిస్తున్నారు. 2008లో సౌదీ అరేబియాలో మొదటి UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా హెగ్రాను ప్రకటించిన 15 సంవత్సరాల తర్వాత పురాతన నబాటియన్ మహిళను పునర్నిర్మించారు. ఈ నబాటియన్ మహిళను అల్యూలాలోని హెగ్రా వెల్‌కమ్ సెంటర్‌లో ప్రదర్శనకు పెట్టారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆమెను హెగ్రా శివార్లలోని 80 మంది వ్యక్తుల అవశేషాలను కలిగి ఉన్న ఒక పర్వత ప్రాంతంలోని సమాధిలో గుర్తించారు. సుగంధ ద్రవ్యాలు, ఇతర విలాసవంతమైన వస్తువుల వ్యాపారులుగా సంపదను పోగుచేసుకుని, పెట్రా నుండి దక్షిణాన ఇప్పుడు వాయువ్య సౌదీ అరేబియాలోకి విస్తరించిన తర్వాత మొదటి శతాబ్దం BCEలో నబాటియన్లు హెగ్రాలో స్థిరపడ్డారని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  హెగ్రా వద్ద ఇసుకరాతి శిఖరాలపై వారు చెక్కిన విస్తృతమైన సమాధుల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకుంటున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ పునర్నిర్మాణ నిపుణులు, 3D నిపుణులు సంయుక్తంగా  నబాటియన్ నాగరికతకు చెందిన మహిళ ముఖాన్ని పునర్నిర్మించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com