ప్రవాసులపై పగబట్టిన కువైట్
- February 08, 2023
కువైట్ సిటీ: ప్రవాసులకు గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో కువైట్ చుక్కలు చూపిస్తోంది. వాటి జారీకి కొత్త రూల్ తీసుకురావడంతో పాటు కఠిన నిబంధనలు విధించింది.దీనిలో భాగంగా గడిచిని నెల రోజుల వ్యవధిలోనే ఆ దేశ ట్రాఫిక్ విభాగం ఏకంగా 2వేల మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ 2వేల మంది జాబితాను సిద్దం చేసింది కూడా. వీరందరికి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కావాల్సిన అర్హతలు లేవని తమ విచారణలో తేలినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.అందుకే వారి నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ను జప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక గతేడాది వలసదారులకు డ్రైవింగ్ లైసెన్ జారీ కోసం కువైట్ కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా యూనివర్శిటీ డిగ్రీ ఉండి, నెలకు 600 కువైటీ దినార్ల కు తగ్గకుండా శాలరీ ఉన్న ప్రవాసులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ ప్రాసెస్‌లో భాగంగా సంబంధిత మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా వలసదారులకు మంజూరు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌లను ఫిల్టర్ చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగాన్ని సూచించారు.ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఓ ప్రవాస అకౌంటెంట్ యూనివర్శిటీ డిగ్రీ కలిగి ఉండి, నెలకు 600కేడీ జీతం తీసుకుంటున్నాడనుకోండి. కానీ, అతడు రెండో యజమానికి మారే సమయంలో జీతం 400కేడీలకు తగ్గితే ఆ అకౌంటెంట్ డ్రైవింగ్ లైసెల్స్ ఉపసంహరించాల్సి ఉంటుందని ట్రాఫిక్ విభాగానికి అండర్ సెక్రటరీ సూచించారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …